Saturday 27 February 2021

శ్రీ అరవింద కంటి ఆసుపత్రి తిరుపతి

 తిరుపతిలో మధురై వారి శ్రీ అరవింద ఉచిత కంటి ఆసుపత్రి కలదు . 

తిరుపతి అలిపిరి నుండి జంతు ప్రదర్శనశాల వెళ్ళు మార్గంలో శ్రీ అరవింద కంటి ఆసుపత్రి ఉంది . ఇక్కడ ఉచిత మరియు డబ్బులు చెల్లించి కూడా కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించుకొన వచ్చును .ఉచితంగా కంటి పరీక్షలు మరియు శస్త్ర చికిత్సలు చేయించుకోదలచిన వారు ఆసుపత్రి సెల్లార్ నందు ఓ పి కలదు . డబ్బులు చెల్ల్లించి కంటి పరీక్షలు మరియు శస్త్ర చికిత్సలు చేయించుకోదలచిన వారు గ్రౌండ్ ఫ్లోర్ నందు ఓ పి కలదు . ఉదయం 7.30 గంటలనుండి - సాయంత్రం 4.30 గంటలవరకు వరకు ఓ పి ఉంటుంది . ఇంతకుముందు మీరు అరవింద ఆసుపత్రి ఏదైనా భ్రాంచ్ నందు చూపించుకొనిఉంటే ఆ కార్డు తీసుకువెళ్లవలసి ఉంటుంది . ఆదివారం సెలవు . మరిన్ని వివరములకు 08772502100 నెంబరుకు సంప్రదించగలరు . తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతి అరగంటకూ ఆర్డినరి బస్సు ఉంది. ఈ బస్సు 39 వ ప్లాట్ ఫాం నుండి బయలు దేరుతుంది .

బూతులు ఎందుకు తిడతారు

 ఇది బూతు కాదు 

అందరూ తెలుసుకోవలసిన విషయం  . బూతులు ఎందుకు తిడతారు 

పిల్లలు గానీ పెద్దలుగానీ ఎదుటివరిని ఇబ్బంది పెట్టినపుడు వానెమ్మ , వానెఖ్ఖ , వాని ఆలి అని , వాని వంశం పాడైపోనూ అని తిడతారు , ఎందుకు అమ్మను , అక్కను , భార్యను , వంశాన్ని తిడతారో ఎవరూ ఆలోచించడంలేదు.  మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి , పిల్లలైనా పెద్దలైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టినప్పుడు బూతులు తిడతారు , ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గరినుండి అబ్బాయిగానివ్వండి , అమ్మాయిగానివ్వండి మొట్టమొదటిగా తల్లి సంరక్షణలో పెరుగుతారు .అప్పుడు ఆపిల్లలను , తల్లి చిన్నప్పటినుండే సంస్కారం నేర్పించి , పెంచి పెద్దచేయాలి .  పిల్లలు సంస్కారం లేకుండా ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా , కొట్టినా , హింసించినా ,  తల్లి సంరక్షణ సరిగ్గా లేదని తల్లిని బూతులు తిడతారు . వానెమ్మ / దానెమ్మ అంటారు .  ఇదే విధంగా ఆఇంట్లో తల్లి తర్వాత అక్క లేదా చెల్లి బాధ్యత , తన వాళ్ళు తప్పు చేసినప్పుడు మందలించి వారిని సరిదిద్దాలి , అక్క , చెల్లి కూడా ఇంట్లో వారిని సరిదిద్దలేనప్పుడు వారిని కూడా బూతులు తిట్టడం మొదలెడతారు .  పెళ్ళయిన తర్వాత ఆస్థానం భార్యది . ఆమె కూడా భర్తను సరిదిద్దకపోతే ఆమెను కూడా బూతులు తిడతారు . కాబట్టి అమ్మను అక్కను ఆలిని ఇందుకే బూతులు తిడతారు . ఆ తర్వాత స్థానం వంశానిది . వీళ్ళెవరూ వారిని సరిదిద్దకపోయినట్లయితే కనీసం వారి వంశంలోని పెద్దలెవరైనా వారిని సరిదిద్దాలి ,  లేకపోతే వాని వంశం సర్వనాశానమైపోనూ అని బూతులు తిడతారు . ఈ విధంగా మన భారత దేశంలో మహిళలకు అంత గొప్ప బాధ్యత ఉంది . తమ కుటుంబ సభ్యులను సంస్కారవంతులుగా తీర్చి దిద్దే బాధ్యత మహిళలదే కాబట్టి , తమ వారిని సంస్కారవంతులుగా తీర్చి దద్దకపోతే , బూతులు కూడా వారికే అన్నట్లు మహిళలను తిడుతూంటారు .

మీ ఆత్మీయుడు చాంద్ బాషా 

Saturday 20 February 2021

DSLR కెమెరా బ్యాటరీ

DSLR కెమెరా బ్యాటరీలు , వీడియో కెమెరా బ్యాటారీలు కొంతకాలం తరువాత , బ్యాటరీ కాంటాక్త్స్ వద్ద రస్ట్ ( చిలుము ) లాగా తయారయి సరిగ్గా చార్జింగ్ కాకపోవడం గానీ లేక సరిగ్గా బ్యాకప్ రాకపోవడం గానీ జరుగుతుంది . ఇయర్ బడ్ తీసుకొని నీళ్ళలో తడిపి , బాగా నీళ్ళు లేకుండా పిండి ఆ బడ్ తో బ్యాటరీ పాయింట్లను రుద్దుతూ శుభ్రం చేయవచ్చును . లేదా ఐ పి సొల్యూషన్ తో అయినా ఇదే పద్ధతిలో శుభ్రం చేయవచ్చును . క్లీన్ చేసిన తర్వాత బ్యాటరీ త్వరగా చార్జ్ కావడం  గానీ బ్యాకప్ ఎక్కువసేపు రావడం గానీ గమనించవచ్చు . ఇయర్ బడ్ ద్వారా బ్యాటరీలోకి నీటి చుక్కలు పడకుండా , కేవలం ఇయర్ బడ్ లో తేమ మాత్రమే ఉండేలా జాగ్రత్ర్త పడాలి . ఇదే విధంగా చార్జర్  లోని కాంటాక్ట్ పిన్స్ కూడా రస్ట్ పట్టి ఉండవచ్చు గమనించి శుభ్రం చేయవచ్చును . ఇంకా రస్ట్ ఉన్నట్లయితే చిన్న సైజు ఆపరేషన్ బ్లేడు తో గోకి రస్ట్ ను శుభ్రం చేయవచ్చును .Wednesday 17 February 2021

తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ లో మహిళలకు యోగ శిక్షణ ప్రారంభం

        ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర్లు తెలిపారు .   తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ మధ్య గేటులో , మొదటి అంతస్తులో , 3 వ నెంబరు నందు ( జ్యోతి ఫోటో స్టూడియో పైన ) ఈనెల 16 వ తేదీ నుండి మహిళలకు యోగా శిక్షణా తరగతులు ప్రారంభమైనవని ఆయన తెలిపారు . యోగ శిక్షణా తరగతులు  ఆయుర్వేద డాక్టరు యామిని దివాకర్ గారిచే నిర్వహింపబడుతున్నవి ,  కావున మహిళలు సంపూర్ణ ఆరోగ్యానికి ప్రశాంత మానసిక స్థితి పొందుట కొరకు యోగా నేర్చుకోగలరని తెలిపారు . ప్రారంభోత్సవానికి రెడ్ క్రాస్ చైర్మన్ డి.వెంకటేశ్వర్లు , రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ వి ప్రసాద్ , కమిటి సభ్యులు యన్.యస్. రవి , రత్న శేఖర్ , డాక్టర్ రవి , ఏ డి య ప్ ఓ.  పి  నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు .  మరిన్ని వివరములకు రెడ్ క్రాస్ చైర్మన్  డి వెంకటేశ్వర్లు   9885002421 నెంబరుకు సంప్రదించగలరు .       

        యోగా - ఆసనములు  అనే రెండు పదాలను కలిపి యోగాసనములు అనేవారు . కాలానుగుణంగా ఆసనములు మరచిపోయి , యోగా మాత్రమే వాడుకభాష లో ఉపయోగించుచున్నారు . యోగః  చిత్తవృత్తి  నిరోధః  అనగా యోగా చేయడంవలన మనస్సు నిగ్రహపరచుకోవచ్చు . యోగా అనగా ప్రాణాయామం ద్వారా ఉఛ్వాస నిస్వాసలను అదుపు చేసి మనస్సును ఏకాగ్రత పరచవచ్చును . తద్వారా జ్ఞాపకశక్తి , ఆరోగ్యము ,  అతీన్ద్రియ శక్తులను సాధించవచ్చునని పతంజలి మహర్షి తన యోగసూత్రాల ద్వారా తెలియచేశారు .ఇప్పుడు యోగా అనగా ఆసనములు , ప్రాణాయామము , ధ్యానము నేర్పించడం జరుగుతున్నది . సైన్సు ఎంత అభివృద్ధి చెందినా మనిషి మానసిక ప్రశాంతత కొరకు , ఆరోగ్యము కొరకు యోగ మార్గమును ఆచరించ వలసిందే .
           

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...