Friday 26 March 2021

ఫోటో స్టూడియె కస్టమర్లకు మనవి

            ఫొటో నిత్యావసర వస్తువులకిందికి రాదు . అనగా ప్రతి రోజూ ఉపయోగ పడేదీ కాదు , ప్రతిరోజూ అవసరపడేదీ  కాదు .    ఎప్పుడో ఒకసారి ఫోటోలతో అవసరమొస్తుంది . పాస్ పోర్టు సైజు ఫోటోలు 8 కాపీలు రు.100 ప్రకారం తెలుగు రాష్ట్రాలలో స్టుడియో వారు చార్జ్ చేస్తున్నారు. కస్టమర్లేమో 10 సంవత్సరాల క్రీందటి  దటి ధర ప్రకారం 50 రూపాయలే కదా  అంటుంటారు .   కెమెరాలు , ప్రీంటర్లు , బాడుగ , కరెంట్ బిల్లు , పెట్రోలు , నిత్యావసర వస్తువులు , పిల్లల స్కూలు ఫీజులూ , బట్టలు , బంగారు , పదింతలు పెరిగాయి . కానీ ఫోటోల ధరలు అంతగా పెరగలేదు . కానీ కస్టమర్లు , యల్ ఐ సి ఏజెంట్లు మాకు ఒక్క కాపీ చాలు లేదా రెండు కాపీలు చాలు అని అంటుంటారు . అలా వీలు పడదు , ఒక షీట్ లో 8 కాపీలు మాత్రమే ప్రింట్ అవుతాయి , కావున కస్టమర్లు గమనించి 8 కాపీల చొప్పున మాత్రమే తీసుకోవలసి వస్తుందని ఫోటో గ్రాఫర్లు తెలియచేస్తున్నారు .

Saturday 20 March 2021

రెడ్ క్రాస్ సైకిల్ ర్యాలీ తిరుపతి

                 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శతజయంతి సందర్భంగా  , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ 20 వ తేదీ శనివారం ఉదయం  సైకిల్ ర్యాలీ నిర్వహించారు . తిరుపతి ఆర్ డి ఓ మరియు ఐ ఆర్ సి ఎస్ డివిజన్ శాఖ అధ్యక్షులు వి కనకనరసా రెడ్డి జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు . తిలక్ రోడ్డు లోని ఐ ఆర్ సి ఎస్ ఆఫీస్ నుండి  ప్రారంభించారు .   కార్యక్రమంలో కోవిడ్ సమయంలో రక్త దాన శిబిరాలు , ప్రాధమిక చికిత్స అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఐ ఆర్ సి య స్ తిరుపతి డివిజన్ శాఖ వారిని కనకనరసా రెడ్డి అభినందించారు . డివిజన్ శాఖ చైర్మన్ ఆచార్య  డి వెంకటేశ్వర్లు ర్యాలీలో పాల్గొన్న సైకిలిస్టులకు సూచనలు సలహాలు ఇస్తూ భవిష్యత్ కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని కోరారు . ఐ ఆర్ సి ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ వి ప్రసాద్ ఐ ఆర్ సి యస్ శత జయంతి గురించి వివరించారు .  శాఖ కార్యదర్శి జి వి  సుబ్బారావు ఆర్డిఓ మరియు ర్యాలీలో పాల్గొన్న సైకిలిస్టులకు కృతజ్ఞతలు తెలియజేశారు .  సైకిల్ ర్యాలీ లో , వీ రైడర్స్ క్లబ్  , యస్ వి వెటర్నిటీ యూనివర్సిటి ,  ఎస్ వి ఆర్ట్స్ కాలేజీ మరియు సెవెన్ హిల్స్ స్కూల్ నుండి దాదాపు 60 మంది  విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు .  తిరుపతి పట్టణం లోని వివిధ ప్రాంతాలలో  దాదాపు పది కిలోమీటర్లు వరకు ర్యాలీని నిర్వహించారు . ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శత జయంతి  సైకిల్ ర్యాలీలో  కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి , రత్నశేఖర్ ,  రవి , డాక్టర్ ప్రతీత్  , డి యఫ్ ఓ చిరంజీవి , ఏ డి యఫ్ ఓ నంద కిషోర్ పాల్గొన్నారు . Thursday 18 March 2021

తిరుపతి వినాయక సాగర్ లో ప్రత్యేక పూజలు

     తిరుపతి వినాయక సాగర్ లో రాబోయే వినాయక చవితి సమయానికి నిమజ్జనం కార్యక్రమానికి ఇబ్బందులు కలుగకుండా చెరువులో నీరు నిలువ ఉండడానికి పూడిక పనులు చేపట్టారు . ఈ సందర్భంగా వినాయక సాగర్ వద్ద ఎలాంటి విఘ్నాలూ కలుగకుండా వినాయక విగ్రహానికి ప్రతి గురువారం వివిధ రకాలైన పూజలు నిర్వహించి  భక్తులకు ప్రసాదాలు పంపిణి చే స్తున్నట్లు కమిటీ సభ్యులు గుండాల గోపీనాధ్ తెలిపారు .  కార్యక్రమంలో యస్ వి యం వెంకటేష్ , ఆర్ సి ముని కృష్ణ  , ఆనంద్ , పొన్నాల జేజి రెడ్డి , అక్కిపల్లి మునికృష్ణయ్య యాదవ్ , టి సుబ్రహ్మణ్యం రెడ్డి , వెంకి , సుబ్రహ్మణ్యం యాదవ్ , చెంగారెడ్డి , దీపక్ , జానకిరామ్ , రాజశేఖర్ రెడ్డి మరియు భక్తులు పాల్గొన్నారు .   


తిరుపతి లో రెడ్ క్రాస్ సంస్థ శతజయంతి సంబరాలు

     ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ శతజయంతి సంబరాలను జరుపుకోనున్న సందర్భంగా అన్ని జిల్లాలలో సైకిల్ ర్యాలీని నిర్వహించమని , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సూచించిందని , తిరుపతి శాఖ చైర్మన్ డి వెంకటేశ్వర్లు తెలిపారు . ఈ సందర్భంగా తిరుపతి డివిజన్ శాఖ వారు ఈనెల 20 వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి కాంప్లెక్స్ రెడ్ క్రాస్ కార్యాలయం నుండి సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నారు . ఈ ర్యాలీ శ్రీదేవి కాంప్లెక్స్ నుండి బయలు దేరి తిలక్ రోడ్ , ఈస్ట్ పోలీసు స్టేషన్ , టి.వి.యస్ సర్కిల్ , వెస్ట్ చర్చి , శ్రీ జ్యోతీ రావు పూలే విగ్రహం , టౌన్ క్లబ్ , రూయా ఆసుపత్రి , ఇస్కాన్ టెంపుల్ , అన్నమయ్య సర్కిల్ , వివి మహల్ రోడ్డు , మునిసిపల్ కార్యాలయం మీదుగా శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ర్యాలీ పూర్తవుతుందని , ర్యాలీలో  రెడ్ క్రాస్ సభ్యులు మరియు విద్యార్ధులు పాల్గొననున్నారని  సంస్థ తిరుపతి శాఖ అద్యక్షులు వి కనకనరసింహా రెడ్డి తెలిపారు .  మరిన్ని వివరములకు రెడ్ క్రాస్ తిరుపతి డివిజన్ చైర్మన్ డి వెంకటేశ్వర్లు ను సంప్రదించగలరు మొబైల్ 9885002421 .

తిరుపతిలో " ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం "

 


Friday 12 March 2021

లైఫ్ ఇన్సూరెన్సు భర్తలకేనా ?


                    హెల్త్ ఇన్సూరెన్సు అయితే భర్తకూ , భార్యకూ , పిల్లలకూ , తల్లి తండ్రులకూ కలిపి ఇన్సూరెన్స్ చేస్తారు , అదే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే భర్త కు ( మగవారికి ) మాత్రమే ఇన్సూరెన్స్ చేస్తారు , ఎందుకు ? అంటే భర్త ముందుగా చనిపోతే భర్యా పిల్లలకు ఇన్సూరెన్స్ డబ్బు ఉపయోగ పడుతుందనే కదా! అంటే ఖచ్చితంగా భర్త ముందే చనిపోతాడానే గ్యారంటీనా ? లేదు భర్త పేరుమీద ఇన్సూరెన్సు చేయించి ,  చంపేస్తే ఇన్సూరెన్సు డబ్బులు భార్యా పిల్లలు అత్తా మామలు ఎంజాయ్ చేయ్యవచ్చనా ? ఏమిటి ఆంతర్యం .  ఎందుకు ఆలోచించరు . భార్యకు కూడా ఇన్సూరెన్సు చెయ్యాలని , భర్తకు ఎందుకు ఆలోచన రావడంలేదు . ఇన్సూరెన్సు ఏజెంట్స్ కూడా ఈ విషయం గురించి చెప్పడంలేదు . ఖచ్చితంగా భర్తే  ముందుగా చనిపోతాడని మన సాంప్రదాయాలేమైన చెప్పాయా ? లేదే , కాబట్టి ఆలోచించి మీరెంత లైఫ్ ఇన్సూరెన్స్ చెయ్యాలనుకుంటారో అందులో సగం భార్య పేరుమీద , సగం భర్త పేరుమీద లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం మంచిది .  ఎవరు చనిపోయినా ఆ కుటుంబం రోడ్డున పడకుండా బ్రతకవచ్చు. ఆలోచించండి !!!

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...