Friday, 26 March 2021

ఫోటో స్టూడియె కస్టమర్లకు మనవి

            ఫొటో నిత్యావసర వస్తువులకిందికి రాదు . అనగా ప్రతి రోజూ ఉపయోగ పడేదీ కాదు , ప్రతిరోజూ అవసరపడేదీ  కాదు .    ఎప్పుడో ఒకసారి ఫోటోలతో అవసరమొస్తుంది . పాస్ పోర్టు సైజు ఫోటోలు 8 కాపీలు రు.100 ప్రకారం తెలుగు రాష్ట్రాలలో స్టుడియో వారు చార్జ్ చేస్తున్నారు. కస్టమర్లేమో 10 సంవత్సరాల క్రీందటి  దటి ధర ప్రకారం 50 రూపాయలే కదా  అంటుంటారు .   కెమెరాలు , ప్రీంటర్లు , బాడుగ , కరెంట్ బిల్లు , పెట్రోలు , నిత్యావసర వస్తువులు , పిల్లల స్కూలు ఫీజులూ , బట్టలు , బంగారు , పదింతలు పెరిగాయి . కానీ ఫోటోల ధరలు అంతగా పెరగలేదు . కానీ కస్టమర్లు , యల్ ఐ సి ఏజెంట్లు మాకు ఒక్క కాపీ చాలు లేదా రెండు కాపీలు చాలు అని అంటుంటారు . అలా వీలు పడదు , ఒక షీట్ లో 8 కాపీలు మాత్రమే ప్రింట్ అవుతాయి , కావున కస్టమర్లు గమనించి 8 కాపీల చొప్పున మాత్రమే తీసుకోవలసి వస్తుందని ఫోటో గ్రాఫర్లు తెలియచేస్తున్నారు .

1 comment:

Hospital Furniture Expo Medicall

      చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఈనెల అనగా జులై నెలలో 29/30/31 తేదీలలో హాస్పిటల్ కు సంబంధించిన " Medicall " ఫర్నిచర్ ఎక్సిబిషన్ జరుగు...