Thursday, 29 April 2021

మీ ఇంట్లోనే గొంతు ఊపిరి తిత్తుల్లోని కఫాన్ని తగ్గించుకోండి


             త్రిదోషాలలో ఒకటైన కఫ దోషం కలగడంవల్ల  , కొంతమంది వేరే ప్రదేశం మారినా , నీళ్ళు మారినా జలుబు చేసినట్లు ఉండడం , గొంతులో మరియు ఛాతీలో అనగా ఊపిరితిత్తుల్లో గల్ల పేరుకు పోయి , విపరీతమైన దగ్గు రావడం, ఊపిరి ఆడడంలో ఇబ్బంది కలుగుతుంది . ఇలాంటి సందర్భాల్లో మన వంట ఇంట్లోనే లభించే మజ్జిగ మరియు వాము తో ఈ కఫాన్ని దగ్గును తగ్గించుకోవచ్చును . ముందుగా వామును పొడి చేసుకొని , అర చెంచా వాము పొడిని గ్లాసు పలుచటి మజ్జిగలొ కలుపుకొని పరగడపునగానీ సాయంత్రం 6 గంటల సమయంలో గాని రోజుకొకసారి త్రాగినా కఫం నుండి ఉపశమనం పొందవచ్చును . ఒకవేళ  మజ్జిగ పడనీ వారు , మజ్జిగ అందుబాటులో లేనప్పుడు గ్లాసు మంచి నీళ్లలో అరస్పూను వామును లేదా వాము పొడిని  కలిపి పొయ్యి మీద కాచి వడగట్టి గోరువెచ్చగా అయినా తర్వాత తాగిన ఎడల కఫాన్ని తగ్గించుకోవచ్చును .   ప్రస్తుత కరోనా పరిస్థితిలో ,  గొంతులో , ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి , శ్వాస తీసుకోవడానికి  ఇబ్బంది పెడుతున్న కఫాన్ని తగ్గించుకోడానికి కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది . ఈ చిట్కాను ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రదీప్ వానపల్లి తెలియచేశారు , వారికి జొమాటో న్యూస్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నాము . 



Saturday, 24 April 2021

కరోనా బాధితులారా మీ ఇంట్లోనే ఉచితంగా ఆక్సిజన్ పొందండి


        కరోనా రోగులకు ఆసుపత్రులలో ఆక్సిజన్ దొరకడం లేదు . ఆసుపత్రులలో అక్సిజన్ కొరత ఉన్నవిషయం అందరికీ తెలిసిందే . అయితే ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చే వరకూ , నెబ్యులైజర్ ద్వారా ఆక్సిజన్ తీసుకోవచ్చని డాక్టర్లు తెలియచేస్తున్నారు . ఆస్తమా ఉన్నవారు ఇంట్లోనే నెబ్యులైజర్ ఉపయోస్తుంటారు .  ఈ నెబ్యులైజర్ మనచుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నున్న ఆక్సిజన్ ను సేకరించి మనకందిస్తుంది . ప్రస్తుతానికి ఆక్సిజన్ దొరకక ఇబ్బందిపడేవారు , ఈ నెబ్యులైజర్ ను ఉపయోగించుకొని ప్రాణాలను కాపాడుకోవచ్చును . నెబ్యులైజర్ 2 వేలు మొదలు 3 వేలవరకు ఉంటుంది. ఈ నెబ్యులైజర్ ను మనము ఇంట్లోనే ఉపయోగించుకొనవచ్చును . ఇందులో ఎలాంటి క్యాప్సూలు వాడవలసిన అవసరం లేదు .    

 


 



Monday, 19 April 2021

లాక్ డౌన్ సమయం కేటాయింపు

     మళ్ళ్ళీ కరోనా కేసులు పెరగడంతో ఏం చెయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాము . కరోనా కంట్రోల్ చెయడానికి ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే , ఉదయం 4 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటలవరకూ వ్యాపార సంస్థలు  తెరుచుకోడానికి సమయాన్ని కేటాఇస్తే  బాగుంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు . తీవ్రమైన ఎండ ఒకప్రక్క , కరోనా ఒక ప్రక్క , ప్రజల వద్ద డబ్బులు లేకపోవడం  ఇలా అనేక కారణాలవల్ల మద్యాహ్నం 2 గంటల నుండి  ప్రజలు బయట తిరగడం లేదు . వ్యాపారులు ఉదయం నుండి రాత్రి వరకూ కాచుకు కూర్చున్నా , మధ్యాహ్నం పైన వ్యాపారాలు జరగడం లేదని , ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వ్యాపారాలు నడుపుకోడానికి సమయం ఇస్తే చాలని , వ్యాపార సంస్థల యజమానులు అభిప్రాయపడుతున్నారు .  

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

                      ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,,  6-1- 2023 తేదీన  అనేకమంది న...