Thursday, 29 April 2021

మీ ఇంట్లోనే గొంతు ఊపిరి తిత్తుల్లోని కఫాన్ని తగ్గించుకోండి


             త్రిదోషాలలో ఒకటైన కఫ దోషం కలగడంవల్ల  , కొంతమంది వేరే ప్రదేశం మారినా , నీళ్ళు మారినా జలుబు చేసినట్లు ఉండడం , గొంతులో మరియు ఛాతీలో అనగా ఊపిరితిత్తుల్లో గల్ల పేరుకు పోయి , విపరీతమైన దగ్గు రావడం, ఊపిరి ఆడడంలో ఇబ్బంది కలుగుతుంది . ఇలాంటి సందర్భాల్లో మన వంట ఇంట్లోనే లభించే మజ్జిగ మరియు వాము తో ఈ కఫాన్ని దగ్గును తగ్గించుకోవచ్చును . ముందుగా వామును పొడి చేసుకొని , అర చెంచా వాము పొడిని గ్లాసు పలుచటి మజ్జిగలొ కలుపుకొని పరగడపునగానీ సాయంత్రం 6 గంటల సమయంలో గాని రోజుకొకసారి త్రాగినా కఫం నుండి ఉపశమనం పొందవచ్చును . ఒకవేళ  మజ్జిగ పడనీ వారు , మజ్జిగ అందుబాటులో లేనప్పుడు గ్లాసు మంచి నీళ్లలో అరస్పూను వామును లేదా వాము పొడిని  కలిపి పొయ్యి మీద కాచి వడగట్టి గోరువెచ్చగా అయినా తర్వాత తాగిన ఎడల కఫాన్ని తగ్గించుకోవచ్చును .   ప్రస్తుత కరోనా పరిస్థితిలో ,  గొంతులో , ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి , శ్వాస తీసుకోవడానికి  ఇబ్బంది పెడుతున్న కఫాన్ని తగ్గించుకోడానికి కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది . ఈ చిట్కాను ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రదీప్ వానపల్లి తెలియచేశారు , వారికి జొమాటో న్యూస్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నాము . No comments:

Post a Comment

Hospital Furniture Expo Medicall

      చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఈనెల అనగా జులై నెలలో 29/30/31 తేదీలలో హాస్పిటల్ కు సంబంధించిన " Medicall " ఫర్నిచర్ ఎక్సిబిషన్ జరుగు...