Sunday, 23 May 2021

అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు

అనారోగ్యం కలిగినప్పుడు డబ్బులు చెల్లించి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చని ధనిక మధ్య తరగతి వారు హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రాధాన్యత ఇస్తారు , ముఖ్యంగా సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు  కూడా తమ కుటుంబానికి మంచి వైద్యం కోసం, ఇన్సురెన్సు కోసం వేల రూపాయలు వెచ్చిస్తున్నారు . మరి హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన వారికి లేదా వారి కుటుంబానికి కరోనా సోకి  ప్రైవేటు ఆసుపత్రిలో చేరడానికి వెళితే ఇన్సూరెన్స్ ఉన్నవారికి బెడ్స్ లేవు అని ఖచ్చితంగా చెబుతున్నారు , అదే ఆసుపత్రిలో నగదు చెల్లిస్తే బెడ్ ఉంది అంటున్నారు . కరోనా లాంటి మహమ్మారి రోగానికి గురై ఆసుపత్రికి వెళితే హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లదు , నగదు చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకుంటాం అన్నప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనం ఏముంది . ఆలోచించండి .  ఎందుకో మరి  ఇన్సూరెన్స్ కంపనీలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్టిస్తున్నారు  . ఇలాగే ఉలుకూ పలుకూ లేకుండా ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇబ్బందిలో పడే సూచనలు కనిపిస్తున్నాయి . ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం మెరుగ్గా ఉంది . కరోనా సోకిన వారికి కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షలు ఖర్చు పెట్టినా చివరకు చేతులెత్తేసి మా వల్ల కాదు అని చెప్పి , కొంతమంది  పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని సిఫార్సు చేస్తున్నారు . ప్రైవేట్ ఆసుపత్రిలో హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లనప్పుడు , వేల రూపాయలు చెల్లించి ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది . పెద్దగా అనారోగ్యం కలిగినప్పుడు లక్షల రూపాయలు చెల్లించుకొలేకనే కదా ఇన్సూరెన్స్ చేసేది . పేదవాడికి చిన్న చిన్న అనారోగ్యాలు  కలిగినప్పుడు  ప్రభుత్వ ఆసుపత్రుల్లో , ఆర్ యం పి డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకోవచ్చు కదా . హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేముందు ఓ సారి ఆలోచిస్తే బాగుంటుందని హెల్త్ ఇన్సూరెన్స్ చేసి కూడా  కార్పొరేట్   వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారు తెలియచేస్తున్నారు .

No comments:

Post a Comment

అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు

అనారోగ్యం కలిగినప్పుడు డబ్బులు చెల్లించి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చని ధనిక మధ్య తరగతి వారు హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రాధాన్యత ...