Wednesday, 5 May 2021

ఉద్యోగం చేస్తున్న మహిళలకు రవాణా ఇబ్బందులు


      ఉద్యోగం చేస్తున్న మహిళలకు రవాణా ఇబ్బందులు ఎదురయ్యాయని , ఉదయం తమ ఉద్యోగాలకు వెళ్ళడానికి బస్సులు , షేర్ ఆటో  సౌకర్యాలున్నాయి కానీ డ్యూటీలు ముగించుకొని మధ్యాహ్నం 2 గంటలపైన రవాణా సౌకర్యం లేదని తాము ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . పురుషులయితే లిప్ట్ అడిగి ఇల్లు చేరడానికి అవకాశముందని , తాము ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు . మధ్యాహ్నం  2 గంటలకు , సాయంత్రం 5గంటలకు , రాత్రి 9 గంటలకు డ్యూటీ దిగిన తర్వాత , తాము ఇల్లు చేరడానికి అవస్థలు పడుతున్నామని , పల్లెలనుండి టౌన్ కు కు వచ్చి ఆసుపత్రులలో , మాల్స్ లో , ప్రైవేటుసంస్థలలో , సూపర్ మార్కెట్ లలో , బట్టల దుకాణాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయాను కులంగా బస్సులు నడపడంగాని లేదా ఆటో సౌకర్యాలు కలుగ చేయాలని ,  ప్రభుత్వం వెంటనే స్పందించాలని  తమ రవాణా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే బాగుంటుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . 

No comments:

Post a Comment

అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు

అనారోగ్యం కలిగినప్పుడు డబ్బులు చెల్లించి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చని ధనిక మధ్య తరగతి వారు హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రాధాన్యత ...