ప్రతి ఒక్కరూ ఇదే ఆలో చిస్తూ ఉంటారు . కొంతమంది కూరగాయలు తినండి , ఆకు కూరలు తినండి , డ్రై ఫ్రూట్స్ తినండి , చికెన్ , మటన్ తినండి , కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తినండి ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటుంటారు . ఓ వారం రోజులు ఇవి తిన్నంత మాత్రాన ఇమ్యూనిటీ పెరగదు , మన నిత్య జీవితంలో అలవాటుగా చేసుకొని తింటూఉండాలి .
ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుంటే అసలు మన పూర్వీకులు ఇవన్నీ తినేవారా? సంగటి తో పాటు పచ్చి మిరపకాయ యర్రగడ్డ నంజుకొని తినేవారు . వారు వ్యవసాయం చేసే వారు , కాయా కష్టం చేసేవారు , బరువులు ఎత్తే వారు , కిలో మీటర్లకొద్దీ నదిచే వారు , గంపెడు పిల్లల్ని కనేవారు , ఉమ్మడి కుటుంబం లో కలిసి అంతమందికి వంటలు చేసి వారికి సేవలుచేసేవారు . కారణం ఏం తిన్నారన్నది కాదు ముఖ్యం . తిన్నది ఏదైనా సరే తిన్నదానికి సరిపడా శారీరిక వ్యాయామం చేశామా లేదా అనేది ముఖ్యం . సంగటి తినండి లేదా జీడిపప్పు బాదం పప్పు తినండి మీ క్యాలరీలు బర్న్ అయి మీ శరీరంలో శక్తి రూపంలో నిలువ ఉండడమనేది ముఖ్యం . తిన్నది జీర్ణం అయినప్పుడే మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది . ఈ లాజిక్ కొంచెం ఆలోచిస్తే మనకంటే మన పూర్వీకులే ఆరోగ్యంగా ఉండేవారు . ఏం తినాలి అనే ఆలోచన పక్కన పెట్టి , తిన్నది ఎలా జీర్ణం చేయాలి అనేదాని గురించి ఆలోచించండి . ఏ పూట తిన్నది ఆపూట జీర్ణం అయ్యేలా శారీరక కష్టం చేయగలినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం . మన ఇమ్యూనిటీ కూడా పెంచుకోగలం .