ఇది బూతు కాదు
అందరూ తెలుసుకోవలసిన విషయం . బూతులు ఎందుకు తిడతారు
పిల్లలు గానీ పెద్దలుగానీ ఎదుటివరిని ఇబ్బంది పెట్టినపుడు వానెమ్మ , వానెఖ్ఖ , వాని ఆలి అని , వాని వంశం పాడైపోనూ అని తిడతారు , ఎందుకు అమ్మను , అక్కను , భార్యను , వంశాన్ని తిడతారో ఎవరూ ఆలోచించడంలేదు. మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి , పిల్లలైనా పెద్దలైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టినప్పుడు బూతులు తిడతారు , ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గరినుండి అబ్బాయిగానివ్వండి , అమ్మాయిగానివ్వండి మొట్టమొదటిగా తల్లి సంరక్షణలో పెరుగుతారు .అప్పుడు ఆపిల్లలను , తల్లి చిన్నప్పటినుండే సంస్కారం నేర్పించి , పెంచి పెద్దచేయాలి . పిల్లలు సంస్కారం లేకుండా ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా , కొట్టినా , హింసించినా , తల్లి సంరక్షణ సరిగ్గా లేదని తల్లిని బూతులు తిడతారు . వానెమ్మ / దానెమ్మ అంటారు . ఇదే విధంగా ఆఇంట్లో తల్లి తర్వాత అక్క లేదా చెల్లి బాధ్యత , తన వాళ్ళు తప్పు చేసినప్పుడు మందలించి వారిని సరిదిద్దాలి , అక్క , చెల్లి కూడా ఇంట్లో వారిని సరిదిద్దలేనప్పుడు వారిని కూడా బూతులు తిట్టడం మొదలెడతారు . పెళ్ళయిన తర్వాత ఆస్థానం భార్యది . ఆమె కూడా భర్తను సరిదిద్దకపోతే ఆమెను కూడా బూతులు తిడతారు . కాబట్టి అమ్మను అక్కను ఆలిని ఇందుకే బూతులు తిడతారు . ఆ తర్వాత స్థానం వంశానిది . వీళ్ళెవరూ వారిని సరిదిద్దకపోయినట్లయితే కనీసం వారి వంశంలోని పెద్దలెవరైనా వారిని సరిదిద్దాలి , లేకపోతే వాని వంశం సర్వనాశానమైపోనూ అని బూతులు తిడతారు . ఈ విధంగా మన భారత దేశంలో మహిళలకు అంత గొప్ప బాధ్యత ఉంది . తమ కుటుంబ సభ్యులను సంస్కారవంతులుగా తీర్చి దిద్దే బాధ్యత మహిళలదే కాబట్టి , తమ వారిని సంస్కారవంతులుగా తీర్చి దద్దకపోతే , బూతులు కూడా వారికే అన్నట్లు మహిళలను తిడుతూంటారు .
మీ ఆత్మీయుడు చాంద్ బాషా