ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర్లు తెలిపారు . తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ మధ్య గేటులో , మొదటి అంతస్తులో , 3 వ నెంబరు నందు ( జ్యోతి ఫోటో స్టూడియో పైన ) ఈనెల 16 వ తేదీ నుండి మహిళలకు యోగా శిక్షణా తరగతులు ప్రారంభమైనవని ఆయన తెలిపారు . యోగ శిక్షణా తరగతులు ఆయుర్వేద డాక్టరు యామిని దివాకర్ గారిచే నిర్వహింపబడుతున్నవి , కావున మహిళలు సంపూర్ణ ఆరోగ్యానికి ప్రశాంత మానసిక స్థితి పొందుట కొరకు యోగా నేర్చుకోగలరని తెలిపారు . ప్రారంభోత్సవానికి రెడ్ క్రాస్ చైర్మన్ డి.వెంకటేశ్వర్లు , రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ వి ప్రసాద్ , కమిటి సభ్యులు యన్.యస్. రవి , రత్న శేఖర్ , డాక్టర్ రవి , ఏ డి య ప్ ఓ. పి నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు . మరిన్ని వివరములకు రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర్లు 9885002421 నెంబరుకు సంప్రదించగలరు .
యోగా - ఆసనములు అనే రెండు పదాలను కలిపి యోగాసనములు అనేవారు . కాలానుగుణంగా ఆసనములు మరచిపోయి , యోగా మాత్రమే వాడుకభాష లో ఉపయోగించుచున్నారు . యోగః చిత్తవృత్తి నిరోధః అనగా యోగా చేయడంవలన మనస్సు నిగ్రహపరచుకోవచ్చు . యోగా అనగా ప్రాణాయామం ద్వారా ఉఛ్వాస నిస్వాసలను అదుపు చేసి మనస్సును ఏకాగ్రత పరచవచ్చును . తద్వారా జ్ఞాపకశక్తి , ఆరోగ్యము , అతీన్ద్రియ శక్తులను సాధించవచ్చునని పతంజలి మహర్షి తన యోగసూత్రాల ద్వారా తెలియచేశారు .ఇప్పుడు యోగా అనగా ఆసనములు , ప్రాణాయామము , ధ్యానము నేర్పించడం జరుగుతున్నది . సైన్సు ఎంత అభివృద్ధి చెందినా మనిషి మానసిక ప్రశాంతత కొరకు , ఆరోగ్యము కొరకు యోగ మార్గమును ఆచరించ వలసిందే .