మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ? అయితే కొంతవరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు . అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెళ్ళి చూపుల సమయంలో నేను ఫలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను అంటే వెంటనే శాలరీ సర్టిఫికేట్ కంపెనీ నుండి వచ్చిన సర్టిఫికేట్ ను ఈ మెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేయమని అడగండి . అదికూడా పి డి యఫ్ ఫార్మేట్ లో అడగండి . అమ్మాయి గానీ అబ్బాయి గానీ ఇంత చదివానని చెప్పినపుడు చదివారా లేదా అని సర్టిఫికెట్లు చూసి నిర్ధారించుకోవాలి తప్పులేదు . వయస్సు ఎంతో వాస్తవం తెలిసి పోతుంది . లేదంటే వర్క్ ఫ్రం హోం అంటారు . ఉద్యోగం ఉండదు ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేస్తున్నాను అంటారు. నమ్మి పెళ్ళి చేస్తారు . ఆ తర్వాత కొన్ని నెలలతరువాత్ ఉద్యోగం లేదని తెలిసీ ఏమీచేయలేని పరిస్థితి . అల్లుడిని కూతురిని అమ్మాయి తల్లి తండ్రులే చాక వలసి వస్తుంది . అమ్మాయి పరిస్థితి నరకమే .
ఇంకా పెళ్ళయిన తర్వాత అబ్బాయికి విదేశాల్లో ఉద్యోగం వస్తే భార్యను కూడా విదేశానికి తీసుకెళతాడో లేదో ముందే తెలుసుకోవాలి . అబ్బాయి అమెరికాలోనో , కువైట్ లోనో ఉంటే అమ్మాయి ఇండియాలోనే అత్తగారింట్లోనో అమ్మాగారింట్లోనో నలిగి పోవలసి ఉంటుంది . పెళ్ళయిన తర్వాత మంచిగానీ చెడుగానీ భార్యా భర్తలు ఒకచోట ఉండడం న్యాయం , హక్కు కూడా .
పెళ్లి కావలసిన కొడుకు ఖాళీగా ఉంటే పెళ్లి కుదరడం లేదని తాత్కాలికంగా ఎదో ఒక ఉద్యోగమో లేక వ్యాపారమో చేసున్నట్లు నటింప చేస్తారు . పెళ్లయిన తర్వాత ఉద్యోగం చేయక వ్యాపారం చేయక సోమరీగా ఉంటూ భార్యకు సరైన సౌకర్యాలు కల్పించ లేక పనికి మాలిన భర్తగా మిగిలిపోతాడు . సంపాదన లేని కొడుక్కు పెళ్లి చేయడం అనేది తల్లి తండ్రుల మూర్ఖత్వం . తన కూతురికి కూడా ఇలాంటి సంపాదన లేని భర్త ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి . తమ కూతురికి భర్త ఎలా ఉండాలనుకుంటారో అంటే అల్లుడు ఇలా ఉంటే నా బిడ్డ సుఖంగా ఉండగలదు అనుకుంటారో , కొడుకును కూడా అలాగే పెంచి పెళ్లి చేయాలి .
పెళ్ళయిన తర్వాత చీటికీ మాటికీ ఆసాంప్రదాయము , ఈ సాంప్రదాయమూ అంటూ బట్టలూ బంగారూ తీసుకురమ్మనే భర్త , అత్తా మామలూ ఉన్నారు , ఇవన్నీ ముందే ఇవ్వగలమా లేదా అని అమ్మాయి తల్లి తండ్రులు ఆలోచించి పెళ్ళి కుదుర్చుకుంటే అమ్మాయి సుఖంగా ఉండగలదు . పెళ్ళయిన తర్వాత కొడుకు కోడలు మావద్దే ఉండాలనే రోజులు పోయాయి , వారి జీవితం వారు చూసుకునే రోజులు వచ్చాయనే విషయం , అబ్బాయి తల్లి తండ్రులు తెలుసుకోవాలి. అబ్బాయి గురించి గానీ అమ్మాయి గురించి గానీ వారి తల్లి తండ్రుల గురించిగానీ ముందుగానే విచారించి నిర్ధారించు కోవాలి . లేదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు . త్వరలోనే మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం . సెలవు .