Showing posts with label రెడ్ క్రాస్ సంస్థ శతజయంతి సంబరాలు. Show all posts
Showing posts with label రెడ్ క్రాస్ సంస్థ శతజయంతి సంబరాలు. Show all posts

Thursday, 18 March 2021

తిరుపతి లో రెడ్ క్రాస్ సంస్థ శతజయంతి సంబరాలు

     ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ శతజయంతి సంబరాలను జరుపుకోనున్న సందర్భంగా అన్ని జిల్లాలలో సైకిల్ ర్యాలీని నిర్వహించమని , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సూచించిందని , తిరుపతి శాఖ చైర్మన్ డి వెంకటేశ్వర్లు తెలిపారు . ఈ సందర్భంగా తిరుపతి డివిజన్ శాఖ వారు ఈనెల 20 వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి కాంప్లెక్స్ రెడ్ క్రాస్ కార్యాలయం నుండి సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నారు . ఈ ర్యాలీ శ్రీదేవి కాంప్లెక్స్ నుండి బయలు దేరి తిలక్ రోడ్ , ఈస్ట్ పోలీసు స్టేషన్ , టి.వి.యస్ సర్కిల్ , వెస్ట్ చర్చి , శ్రీ జ్యోతీ రావు పూలే విగ్రహం , టౌన్ క్లబ్ , రూయా ఆసుపత్రి , ఇస్కాన్ టెంపుల్ , అన్నమయ్య సర్కిల్ , వివి మహల్ రోడ్డు , మునిసిపల్ కార్యాలయం మీదుగా శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ర్యాలీ పూర్తవుతుందని , ర్యాలీలో  రెడ్ క్రాస్ సభ్యులు మరియు విద్యార్ధులు పాల్గొననున్నారని  సంస్థ తిరుపతి శాఖ అద్యక్షులు వి కనకనరసింహా రెడ్డి తెలిపారు .  మరిన్ని వివరములకు రెడ్ క్రాస్ తిరుపతి డివిజన్ చైర్మన్ డి వెంకటేశ్వర్లు ను సంప్రదించగలరు మొబైల్ 9885002421 .

Hospital Furniture Expo Medicall

      చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఈనెల అనగా జులై నెలలో 29/30/31 తేదీలలో హాస్పిటల్ కు సంబంధించిన " Medicall " ఫర్నిచర్ ఎక్సిబిషన్ జరుగు...