ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శతజయంతి సందర్భంగా , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ 20 వ తేదీ శనివారం ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు . తిరుపతి ఆర్ డి ఓ మరియు ఐ ఆర్ సి ఎస్ డివిజన్ శాఖ అధ్యక్షులు వి కనకనరసా రెడ్డి జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు . తిలక్ రోడ్డు లోని ఐ ఆర్ సి ఎస్ ఆఫీస్ నుండి ప్రారంభించారు . కార్యక్రమంలో కోవిడ్ సమయంలో రక్త దాన శిబిరాలు , ప్రాధమిక చికిత్స అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఐ ఆర్ సి య స్ తిరుపతి డివిజన్ శాఖ వారిని కనకనరసా రెడ్డి అభినందించారు . డివిజన్ శాఖ చైర్మన్ ఆచార్య డి వెంకటేశ్వర్లు ర్యాలీలో పాల్గొన్న సైకిలిస్టులకు సూచనలు సలహాలు ఇస్తూ భవిష్యత్ కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని కోరారు . ఐ ఆర్ సి ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ వి ప్రసాద్ ఐ ఆర్ సి యస్ శత జయంతి గురించి వివరించారు . శాఖ కార్యదర్శి జి వి సుబ్బారావు ఆర్డిఓ మరియు ర్యాలీలో పాల్గొన్న సైకిలిస్టులకు కృతజ్ఞతలు తెలియజేశారు . సైకిల్ ర్యాలీ లో , వీ రైడర్స్ క్లబ్ , యస్ వి వెటర్నిటీ యూనివర్సిటి , ఎస్ వి ఆర్ట్స్ కాలేజీ మరియు సెవెన్ హిల్స్ స్కూల్ నుండి దాదాపు 60 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు . తిరుపతి పట్టణం లోని వివిధ ప్రాంతాలలో దాదాపు పది కిలోమీటర్లు వరకు ర్యాలీని నిర్వహించారు . ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శత జయంతి సైకిల్ ర్యాలీలో కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి , రత్నశేఖర్ , రవి , డాక్టర్ ప్రతీత్ , డి యఫ్ ఓ చిరంజీవి , ఏ డి యఫ్ ఓ నంద కిషోర్ పాల్గొన్నారు .
Showing posts with label రెడ్ క్రాస్ సైకిల్ ర్యాలీ తిరుపతి. Show all posts
Showing posts with label రెడ్ క్రాస్ సైకిల్ ర్యాలీ తిరుపతి. Show all posts
Subscribe to:
Posts (Atom)
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,, 6-1- 2023 తేదీన అనేకమంది న...

-
మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ? అయితే కొంతవరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు . అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెళ్ళి చూపుల సమయంలో నేను ...
-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర...
-
నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం లో కరోనాను అరికట్టడానికి ఆయుర్వేద వైద్యం ఇస్తున్న ఆనందయ్య వద్ద వేల మంది జనం క్యూ ఉన్నందున ఆయుర్వేద మందు దొర...