హెల్త్ ఇన్సూరెన్సు అయితే భర్తకూ , భార్యకూ , పిల్లలకూ , తల్లి తండ్రులకూ కలిపి ఇన్సూరెన్స్ చేస్తారు , అదే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే భర్త కు ( మగవారికి ) మాత్రమే ఇన్సూరెన్స్ చేస్తారు , ఎందుకు ? అంటే భర్త ముందుగా చనిపోతే భర్యా పిల్లలకు ఇన్సూరెన్స్ డబ్బు ఉపయోగ పడుతుందనే కదా! అంటే ఖచ్చితంగా భర్త ముందే చనిపోతాడానే గ్యారంటీనా ? లేదు భర్త పేరుమీద ఇన్సూరెన్సు చేయించి , చంపేస్తే ఇన్సూరెన్సు డబ్బులు భార్యా పిల్లలు అత్తా మామలు ఎంజాయ్ చేయ్యవచ్చనా ? ఏమిటి ఆంతర్యం . ఎందుకు ఆలోచించరు . భార్యకు కూడా ఇన్సూరెన్సు చెయ్యాలని , భర్తకు ఎందుకు ఆలోచన రావడంలేదు . ఇన్సూరెన్సు ఏజెంట్స్ కూడా ఈ విషయం గురించి చెప్పడంలేదు . ఖచ్చితంగా భర్తే ముందుగా చనిపోతాడని మన సాంప్రదాయాలేమైన చెప్పాయా ? లేదే , కాబట్టి ఆలోచించి మీరెంత లైఫ్ ఇన్సూరెన్స్ చెయ్యాలనుకుంటారో అందులో సగం భార్య పేరుమీద , సగం భర్త పేరుమీద లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం మంచిది . ఎవరు చనిపోయినా ఆ కుటుంబం రోడ్డున పడకుండా బ్రతకవచ్చు. ఆలోచించండి !!!
Showing posts with label లైఫ్ ఇన్సూరెన్సు భర్తలకేనా ?. Show all posts
Showing posts with label లైఫ్ ఇన్సూరెన్సు భర్తలకేనా ?. Show all posts
Subscribe to:
Posts (Atom)
Hospital Furniture Expo Medicall
చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఈనెల అనగా జులై నెలలో 29/30/31 తేదీలలో హాస్పిటల్ కు సంబంధించిన " Medicall " ఫర్నిచర్ ఎక్సిబిషన్ జరుగు...

-
తిరుపతి శిల్పారామంలో " గాంధి శిల్ప బజార్ 2021" ఈనెల 22 - 31 వరకు హ్యాండీ క్రాఫ్ట్ మేలా జరుగుతున్నది . ఇందులో బెడ్ షీట్లు , శార...
-
అవును కరోనా వైరస్ మిమ్మల్నేం చేయలేక పోవచ్చు , కానీ మీ వల్ల మీ ఇంటిలోని వారిని అమ్మా నాన్నా , భార్యా పిల్లలు , అవ్వ తాత వీళ్లకు మీ ...
-
ఫోటో గ్రాఫర్స్ , విడియో గ్రాఫర్స్ , ఫొటో విడియో ఎడిటింగ్ మిక్సింగ్ , ల్యాబ్ వారికి సంబంధించిన ఫోటో విడియో డిజిటల్ ఫ్రేమింగ్ మరియు ఆల్...