తిరుపతిలో మధురై వారి శ్రీ అరవింద ఉచిత కంటి ఆసుపత్రి కలదు .
తిరుపతి అలిపిరి నుండి జంతు ప్రదర్శనశాల వెళ్ళు మార్గంలో శ్రీ అరవింద కంటి ఆసుపత్రి ఉంది . ఇక్కడ ఉచిత మరియు డబ్బులు చెల్లించి కూడా కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించుకొన వచ్చును .ఉచితంగా కంటి పరీక్షలు మరియు శస్త్ర చికిత్సలు చేయించుకోదలచిన వారు ఆసుపత్రి సెల్లార్ నందు ఓ పి కలదు . డబ్బులు చెల్ల్లించి కంటి పరీక్షలు మరియు శస్త్ర చికిత్సలు చేయించుకోదలచిన వారు గ్రౌండ్ ఫ్లోర్ నందు ఓ పి కలదు . ఉదయం 7.30 గంటలనుండి - సాయంత్రం 4.30 గంటలవరకు వరకు ఓ పి ఉంటుంది . ఇంతకుముందు మీరు అరవింద ఆసుపత్రి ఏదైనా భ్రాంచ్ నందు చూపించుకొనిఉంటే ఆ కార్డు తీసుకువెళ్లవలసి ఉంటుంది . ఆదివారం సెలవు . మరిన్ని వివరములకు 08772502100 నెంబరుకు సంప్రదించగలరు . తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతి అరగంటకూ ఆర్డినరి బస్సు ఉంది. ఈ బస్సు 39 వ ప్లాట్ ఫాం నుండి బయలు దేరుతుంది .