Saturday, 27 February 2021

శ్రీ అరవింద కంటి ఆసుపత్రి తిరుపతి

 తిరుపతిలో మధురై వారి శ్రీ అరవింద ఉచిత కంటి ఆసుపత్రి కలదు . 

తిరుపతి అలిపిరి నుండి జంతు ప్రదర్శనశాల వెళ్ళు మార్గంలో శ్రీ అరవింద కంటి ఆసుపత్రి ఉంది . ఇక్కడ ఉచిత మరియు డబ్బులు చెల్లించి కూడా కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించుకొన వచ్చును .ఉచితంగా కంటి పరీక్షలు మరియు శస్త్ర చికిత్సలు చేయించుకోదలచిన వారు ఆసుపత్రి సెల్లార్ నందు ఓ పి కలదు . డబ్బులు చెల్ల్లించి కంటి పరీక్షలు మరియు శస్త్ర చికిత్సలు చేయించుకోదలచిన వారు గ్రౌండ్ ఫ్లోర్ నందు ఓ పి కలదు . ఉదయం 7.30 గంటలనుండి - సాయంత్రం 4.30 గంటలవరకు వరకు ఓ పి ఉంటుంది . ఇంతకుముందు మీరు అరవింద ఆసుపత్రి ఏదైనా భ్రాంచ్ నందు చూపించుకొనిఉంటే ఆ కార్డు తీసుకువెళ్లవలసి ఉంటుంది . ఆదివారం సెలవు . మరిన్ని వివరములకు 08772502100 నెంబరుకు సంప్రదించగలరు . తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతి అరగంటకూ ఆర్డినరి బస్సు ఉంది. ఈ బస్సు 39 వ ప్లాట్ ఫాం నుండి బయలు దేరుతుంది .

బూతులు ఎందుకు తిడతారు

 ఇది బూతు కాదు 

అందరూ తెలుసుకోవలసిన విషయం  . బూతులు ఎందుకు తిడతారు 

పిల్లలు గానీ పెద్దలుగానీ ఎదుటివరిని ఇబ్బంది పెట్టినపుడు వానెమ్మ , వానెఖ్ఖ , వాని ఆలి అని , వాని వంశం పాడైపోనూ అని తిడతారు , ఎందుకు అమ్మను , అక్కను , భార్యను , వంశాన్ని తిడతారో ఎవరూ ఆలోచించడంలేదు.  మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి , పిల్లలైనా పెద్దలైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టినప్పుడు బూతులు తిడతారు , ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గరినుండి అబ్బాయిగానివ్వండి , అమ్మాయిగానివ్వండి మొట్టమొదటిగా తల్లి సంరక్షణలో పెరుగుతారు .అప్పుడు ఆపిల్లలను , తల్లి చిన్నప్పటినుండే సంస్కారం నేర్పించి , పెంచి పెద్దచేయాలి .  పిల్లలు సంస్కారం లేకుండా ఎదుటివారిని ఇబ్బంది పెట్టినా , కొట్టినా , హింసించినా ,  తల్లి సంరక్షణ సరిగ్గా లేదని తల్లిని బూతులు తిడతారు . వానెమ్మ / దానెమ్మ అంటారు .  ఇదే విధంగా ఆఇంట్లో తల్లి తర్వాత అక్క లేదా చెల్లి బాధ్యత , తన వాళ్ళు తప్పు చేసినప్పుడు మందలించి వారిని సరిదిద్దాలి , అక్క , చెల్లి కూడా ఇంట్లో వారిని సరిదిద్దలేనప్పుడు వారిని కూడా బూతులు తిట్టడం మొదలెడతారు .  పెళ్ళయిన తర్వాత ఆస్థానం భార్యది . ఆమె కూడా భర్తను సరిదిద్దకపోతే ఆమెను కూడా బూతులు తిడతారు . కాబట్టి అమ్మను అక్కను ఆలిని ఇందుకే బూతులు తిడతారు . ఆ తర్వాత స్థానం వంశానిది . వీళ్ళెవరూ వారిని సరిదిద్దకపోయినట్లయితే కనీసం వారి వంశంలోని పెద్దలెవరైనా వారిని సరిదిద్దాలి ,  లేకపోతే వాని వంశం సర్వనాశానమైపోనూ అని బూతులు తిడతారు . ఈ విధంగా మన భారత దేశంలో మహిళలకు అంత గొప్ప బాధ్యత ఉంది . తమ కుటుంబ సభ్యులను సంస్కారవంతులుగా తీర్చి దిద్దే బాధ్యత మహిళలదే కాబట్టి , తమ వారిని సంస్కారవంతులుగా తీర్చి దద్దకపోతే , బూతులు కూడా వారికే అన్నట్లు మహిళలను తిడుతూంటారు .

మీ ఆత్మీయుడు చాంద్ బాషా 

Saturday, 20 February 2021

DSLR కెమెరా బ్యాటరీ

DSLR కెమెరా బ్యాటరీలు , వీడియో కెమెరా బ్యాటారీలు కొంతకాలం తరువాత , బ్యాటరీ కాంటాక్త్స్ వద్ద రస్ట్ ( చిలుము ) లాగా తయారయి సరిగ్గా చార్జింగ్ కాకపోవడం గానీ లేక సరిగ్గా బ్యాకప్ రాకపోవడం గానీ జరుగుతుంది . ఇయర్ బడ్ తీసుకొని నీళ్ళలో తడిపి , బాగా నీళ్ళు లేకుండా పిండి ఆ బడ్ తో బ్యాటరీ పాయింట్లను రుద్దుతూ శుభ్రం చేయవచ్చును . లేదా ఐ పి సొల్యూషన్ తో అయినా ఇదే పద్ధతిలో శుభ్రం చేయవచ్చును . క్లీన్ చేసిన తర్వాత బ్యాటరీ త్వరగా చార్జ్ కావడం  గానీ బ్యాకప్ ఎక్కువసేపు రావడం గానీ గమనించవచ్చు . ఇయర్ బడ్ ద్వారా బ్యాటరీలోకి నీటి చుక్కలు పడకుండా , కేవలం ఇయర్ బడ్ లో తేమ మాత్రమే ఉండేలా జాగ్రత్ర్త పడాలి . ఇదే విధంగా చార్జర్  లోని కాంటాక్ట్ పిన్స్ కూడా రస్ట్ పట్టి ఉండవచ్చు గమనించి శుభ్రం చేయవచ్చును . ఇంకా రస్ట్ ఉన్నట్లయితే చిన్న సైజు ఆపరేషన్ బ్లేడు తో గోకి రస్ట్ ను శుభ్రం చేయవచ్చును .Wednesday, 17 February 2021

తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ లో మహిళలకు యోగ శిక్షణ ప్రారంభం

        ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర్లు తెలిపారు .   తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ మధ్య గేటులో , మొదటి అంతస్తులో , 3 వ నెంబరు నందు ( జ్యోతి ఫోటో స్టూడియో పైన ) ఈనెల 16 వ తేదీ నుండి మహిళలకు యోగా శిక్షణా తరగతులు ప్రారంభమైనవని ఆయన తెలిపారు . యోగ శిక్షణా తరగతులు  ఆయుర్వేద డాక్టరు యామిని దివాకర్ గారిచే నిర్వహింపబడుతున్నవి ,  కావున మహిళలు సంపూర్ణ ఆరోగ్యానికి ప్రశాంత మానసిక స్థితి పొందుట కొరకు యోగా నేర్చుకోగలరని తెలిపారు . ప్రారంభోత్సవానికి రెడ్ క్రాస్ చైర్మన్ డి.వెంకటేశ్వర్లు , రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ వి ప్రసాద్ , కమిటి సభ్యులు యన్.యస్. రవి , రత్న శేఖర్ , డాక్టర్ రవి , ఏ డి య ప్ ఓ.  పి  నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు .  మరిన్ని వివరములకు రెడ్ క్రాస్ చైర్మన్  డి వెంకటేశ్వర్లు   9885002421 నెంబరుకు సంప్రదించగలరు .       

        యోగా - ఆసనములు  అనే రెండు పదాలను కలిపి యోగాసనములు అనేవారు . కాలానుగుణంగా ఆసనములు మరచిపోయి , యోగా మాత్రమే వాడుకభాష లో ఉపయోగించుచున్నారు . యోగః  చిత్తవృత్తి  నిరోధః  అనగా యోగా చేయడంవలన మనస్సు నిగ్రహపరచుకోవచ్చు . యోగా అనగా ప్రాణాయామం ద్వారా ఉఛ్వాస నిస్వాసలను అదుపు చేసి మనస్సును ఏకాగ్రత పరచవచ్చును . తద్వారా జ్ఞాపకశక్తి , ఆరోగ్యము ,  అతీన్ద్రియ శక్తులను సాధించవచ్చునని పతంజలి మహర్షి తన యోగసూత్రాల ద్వారా తెలియచేశారు .ఇప్పుడు యోగా అనగా ఆసనములు , ప్రాణాయామము , ధ్యానము నేర్పించడం జరుగుతున్నది . సైన్సు ఎంత అభివృద్ధి చెందినా మనిషి మానసిక ప్రశాంతత కొరకు , ఆరోగ్యము కొరకు యోగ మార్గమును ఆచరించ వలసిందే .
           

Thursday, 28 January 2021

మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ?

          మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ? అయితే కొంతవరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు . అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెళ్ళి చూపుల సమయంలో నేను ఫలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను అంటే వెంటనే శాలరీ సర్టిఫికేట్ కంపెనీ నుండి వచ్చిన సర్టిఫికేట్ ను  ఈ  మెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేయమని అడగండి .  అదికూడా పి డి యఫ్ ఫార్మేట్ లో అడగండి .  అమ్మాయి గానీ అబ్బాయి గానీ ఇంత చదివానని చెప్పినపుడు చదివారా లేదా అని సర్టిఫికెట్లు చూసి నిర్ధారించుకోవాలి తప్పులేదు . వయస్సు ఎంతో వాస్తవం తెలిసి పోతుంది .  లేదంటే వర్క్ ఫ్రం హోం అంటారు . ఉద్యోగం ఉండదు ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేస్తున్నాను అంటారు. నమ్మి పెళ్ళి చేస్తారు . ఆ తర్వాత కొన్ని నెలలతరువాత్ ఉద్యోగం లేదని తెలిసీ ఏమీచేయలేని పరిస్థితి .  అల్లుడిని కూతురిని అమ్మాయి తల్లి తండ్రులే చాక వలసి వస్తుంది  . అమ్మాయి పరిస్థితి నరకమే .   

   

      ఇంకా పెళ్ళయిన తర్వాత అబ్బాయికి విదేశాల్లో ఉద్యోగం వస్తే భార్యను కూడా విదేశానికి తీసుకెళతాడో లేదో ముందే తెలుసుకోవాలి . అబ్బాయి అమెరికాలోనో , కువైట్ లోనో ఉంటే అమ్మాయి ఇండియాలోనే అత్తగారింట్లోనో అమ్మాగారింట్లోనో నలిగి పోవలసి ఉంటుంది . పెళ్ళయిన తర్వాత మంచిగానీ చెడుగానీ    భార్యా భర్తలు ఒకచోట ఉండడం న్యాయం , హక్కు కూడా . 

        పెళ్లి కావలసిన కొడుకు ఖాళీగా ఉంటే పెళ్లి కుదరడం లేదని తాత్కాలికంగా ఎదో ఒక ఉద్యోగమో లేక వ్యాపారమో చేసున్నట్లు నటింప చేస్తారు . పెళ్లయిన తర్వాత ఉద్యోగం చేయక వ్యాపారం చేయక సోమరీగా ఉంటూ భార్యకు సరైన సౌకర్యాలు కల్పించ లేక పనికి మాలిన భర్తగా మిగిలిపోతాడు . సంపాదన లేని కొడుక్కు పెళ్లి చేయడం అనేది తల్లి తండ్రుల మూర్ఖత్వం . తన కూతురికి కూడా ఇలాంటి సంపాదన లేని భర్త ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి . తమ కూతురికి భర్త ఎలా ఉండాలనుకుంటారో అంటే అల్లుడు ఇలా ఉంటే నా బిడ్డ సుఖంగా ఉండగలదు అనుకుంటారో , కొడుకును కూడా  అలాగే పెంచి పెళ్లి చేయాలి . 

     పెళ్ళయిన తర్వాత చీటికీ మాటికీ ఆసాంప్రదాయము , ఈ సాంప్రదాయమూ అంటూ బట్టలూ  బంగారూ తీసుకురమ్మనే భర్త , అత్తా మామలూ ఉన్నారు , ఇవన్నీ ముందే ఇవ్వగలమా లేదా అని అమ్మాయి తల్లి తండ్రులు ఆలోచించి పెళ్ళి కుదుర్చుకుంటే అమ్మాయి సుఖంగా ఉండగలదు . పెళ్ళయిన తర్వాత కొడుకు కోడలు మావద్దే ఉండాలనే రోజులు పోయాయి , వారి జీవితం వారు చూసుకునే రోజులు వచ్చాయనే విషయం , అబ్బాయి తల్లి తండ్రులు తెలుసుకోవాలి.  అబ్బాయి గురించి గానీ అమ్మాయి గురించి గానీ వారి తల్లి తండ్రుల గురించిగానీ ముందుగానే విచారించి నిర్ధారించు కోవాలి  . లేదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు . త్వరలోనే మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం . సెలవు .    

Thursday, 21 January 2021

తిరుపతి శిల్పారామంలో హ్య్ండీ క్రాఫ్ట్ మేలా

 తిరుపతి శిల్పారామంలో " గాంధి శిల్ప బజార్ 2021"  ఈనెల 22 - 31 వరకు హ్యాండీ క్రాఫ్ట్  మేలా జరుగుతున్నది .  ఇందులో బెడ్ షీట్లు , శారీస్ , లేడీస్ పర్సులు , చిన్నపిల్లలకు బొమ్మలు , వాల్ హ్యంగింగ్ పెయింటింగ్స్ , రుద్రాక్ష మాలలు , ఫ్లవర్ వేజ్ తదితరములైన కళాత్మక హ్యాండీ క్రాఫ్ట్స్ కనువిందు చేస్తున్నాయి . ఈ నెల 22 వ తేదీన మొదలైన గాంధి శిల్ప బజార్ ఈ నెల 31 వ తేదీన ముగియనున్నది . 

                                          
    
                                                                        Advertisement


 

అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు

అనారోగ్యం కలిగినప్పుడు డబ్బులు చెల్లించి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చని ధనిక మధ్య తరగతి వారు హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రాధాన్యత ...