Wednesday, 5 May 2021

హైదరాబాద్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి ఉచిత ఆహార పంపిణి

    యూసఫ్ గూడ , శ్రీనగర్ కాలనీ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్ల్ ఏరియాలో కరోన వచ్చి హోం క్వారెంటైనలో హోం క్వారంటైన్ లో ఉన్నవారికి ఉచితంగా ఆహారం పంణీ చెస్తున్న నీహారిక రెడ్డి కి మరియు ఆమెకుసహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ జొమటొ న్యూస్ తరఫున క్రుతగ్నతలు తెలియచేస్తున్నాము . ఇలా మనసున్నవారు , ఇబ్బందులలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన  అవసర మొచ్చింది . తోచిన సహాయం చేసి మన తోటివారిని కాపాడుకుందాం .   జీరా రైస్ , ఆలు కూర్మ , కీరా , క్యారెట్ , ఇమ్మ్యూనిటీ చాక్లెట్ , పెరుగు లాంటి ఆహారము అందిచబడును  .  హైదరాబాదులోని  యూసఫ్ గూడ , శ్రీనగర్ కాలనీ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్ల్ ఏరియాలో కరోన వచ్చి హోం క్వారెంటైనలో ఉంటూ.. ఫుడ్ కి ఇబ్బంది పడుతున్న వారెవరైనా ఈ క్రింద నెంబర్ కి కాల్ చేయండి. ఒక రోజు ముందుగా కాల్ చేసి , మీ లొకేషన్ షేర్ చేస్తే మేము మీకు టైం కి హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ మీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తాము . మరిన్ని వివరములకు  సంప్రదించండి  9701821089











ఉద్యోగం చేస్తున్న మహిళలకు రవాణా ఇబ్బందులు


      ఉద్యోగం చేస్తున్న మహిళలకు రవాణా ఇబ్బందులు ఎదురయ్యాయని , ఉదయం తమ ఉద్యోగాలకు వెళ్ళడానికి బస్సులు , షేర్ ఆటో  సౌకర్యాలున్నాయి కానీ డ్యూటీలు ముగించుకొని మధ్యాహ్నం 2 గంటలపైన రవాణా సౌకర్యం లేదని తాము ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . పురుషులయితే లిప్ట్ అడిగి ఇల్లు చేరడానికి అవకాశముందని , తాము ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు . మధ్యాహ్నం  2 గంటలకు , సాయంత్రం 5గంటలకు , రాత్రి 9 గంటలకు డ్యూటీ దిగిన తర్వాత , తాము ఇల్లు చేరడానికి అవస్థలు పడుతున్నామని , పల్లెలనుండి టౌన్ కు కు వచ్చి ఆసుపత్రులలో , మాల్స్ లో , ప్రైవేటుసంస్థలలో , సూపర్ మార్కెట్ లలో , బట్టల దుకాణాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయాను కులంగా బస్సులు నడపడంగాని లేదా ఆటో సౌకర్యాలు కలుగ చేయాలని ,  ప్రభుత్వం వెంటనే స్పందించాలని  తమ రవాణా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే బాగుంటుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . 

Saturday, 1 May 2021

ఇమ్యూనిటీ పెరగాలంటే


    ప్రతి ఒక్కరూ ఇదే ఆలో చిస్తూ ఉంటారు . కొంతమంది కూరగాయలు తినండి , ఆకు కూరలు తినండి , డ్రై ఫ్రూట్స్ తినండి ,  చికెన్ , మటన్ తినండి , కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తినండి  ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటుంటారు . ఓ వారం రోజులు ఇవి తిన్నంత మాత్రాన ఇమ్యూనిటీ పెరగదు , మన నిత్య జీవితంలో అలవాటుగా చేసుకొని తింటూఉండాలి .

    ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుంటే అసలు మన పూర్వీకులు ఇవన్నీ తినేవారా? సంగటి తో పాటు పచ్చి మిరపకాయ యర్రగడ్డ నంజుకొని తినేవారు .  వారు వ్యవసాయం చేసే వారు ,  కాయా కష్టం చేసేవారు , బరువులు ఎత్తే వారు , కిలో మీటర్లకొద్దీ నదిచే వారు , గంపెడు పిల్లల్ని కనేవారు , ఉమ్మడి కుటుంబం లో కలిసి అంతమందికి వంటలు చేసి వారికి సేవలుచేసేవారు .  కారణం ఏం తిన్నారన్నది కాదు ముఖ్యం . తిన్నది ఏదైనా సరే తిన్నదానికి సరిపడా శారీరిక వ్యాయామం చేశామా లేదా అనేది ముఖ్యం . సంగటి తినండి లేదా జీడిపప్పు బాదం పప్పు తినండి మీ క్యాలరీలు బర్న్ అయి మీ శరీరంలో శక్తి రూపంలో నిలువ ఉండడమనేది ముఖ్యం . తిన్నది జీర్ణం అయినప్పుడే మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది . ఈ లాజిక్ కొంచెం ఆలోచిస్తే మనకంటే మన పూర్వీకులే ఆరోగ్యంగా ఉండేవారు . ఏం తినాలి అనే ఆలోచన పక్కన పెట్టి , తిన్నది ఎలా  జీర్ణం చేయాలి అనేదాని గురించి ఆలోచించండి . ఏ పూట తిన్నది ఆపూట జీర్ణం అయ్యేలా శారీరక కష్టం  చేయగలినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం .  మన ఇమ్యూనిటీ కూడా పెంచుకోగలం  .

కరోనా . . . నన్నేం చేయలేదు . . .


        అవును కరోనా వైరస్ మిమ్మల్నేం చేయలేక పోవచ్చు , కానీ మీ వల్ల మీ ఇంటిలోని వారిని అమ్మా నాన్నా , భార్యా పిల్లలు , అవ్వ తాత వీళ్లకు మీ వల్ల కరోనా వైరస్ సోకవచ్చు . మీలాగా ఇమ్యూనిటీ వారికి ఉండకపోవచ్చు , వారికి వైరస్ సోకి మరణించిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు . ఆలోచించండి . జరగరానిది జరగకముందే జాగ్రత్త పడండి .  



Wednesday, 28 April 2021

మీ ఇంట్లోనే గొంతు ఊపిరి తిత్తుల్లోని కఫాన్ని తగ్గించుకోండి


             త్రిదోషాలలో ఒకటైన కఫ దోషం కలగడంవల్ల  , కొంతమంది వేరే ప్రదేశం మారినా , నీళ్ళు మారినా జలుబు చేసినట్లు ఉండడం , గొంతులో మరియు ఛాతీలో అనగా ఊపిరితిత్తుల్లో గల్ల పేరుకు పోయి , విపరీతమైన దగ్గు రావడం, ఊపిరి ఆడడంలో ఇబ్బంది కలుగుతుంది . ఇలాంటి సందర్భాల్లో మన వంట ఇంట్లోనే లభించే మజ్జిగ మరియు వాము తో ఈ కఫాన్ని దగ్గును తగ్గించుకోవచ్చును . ముందుగా వామును పొడి చేసుకొని , అర చెంచా వాము పొడిని గ్లాసు పలుచటి మజ్జిగలొ కలుపుకొని పరగడపునగానీ సాయంత్రం 6 గంటల సమయంలో గాని రోజుకొకసారి త్రాగినా కఫం నుండి ఉపశమనం పొందవచ్చును . ఒకవేళ  మజ్జిగ పడనీ వారు , మజ్జిగ అందుబాటులో లేనప్పుడు గ్లాసు మంచి నీళ్లలో అరస్పూను వామును లేదా వాము పొడిని  కలిపి పొయ్యి మీద కాచి వడగట్టి గోరువెచ్చగా అయినా తర్వాత తాగిన ఎడల కఫాన్ని తగ్గించుకోవచ్చును .   ప్రస్తుత కరోనా పరిస్థితిలో ,  గొంతులో , ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి , శ్వాస తీసుకోవడానికి  ఇబ్బంది పెడుతున్న కఫాన్ని తగ్గించుకోడానికి కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది . ఈ చిట్కాను ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రదీప్ వానపల్లి తెలియచేశారు , వారికి జొమాటో న్యూస్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నాము . 



Saturday, 24 April 2021

కరోనా బాధితులారా మీ ఇంట్లోనే ఉచితంగా ఆక్సిజన్ పొందండి


        కరోనా రోగులకు ఆసుపత్రులలో ఆక్సిజన్ దొరకడం లేదు . ఆసుపత్రులలో అక్సిజన్ కొరత ఉన్నవిషయం అందరికీ తెలిసిందే . అయితే ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చే వరకూ , నెబ్యులైజర్ ద్వారా ఆక్సిజన్ తీసుకోవచ్చని డాక్టర్లు తెలియచేస్తున్నారు . ఆస్తమా ఉన్నవారు ఇంట్లోనే నెబ్యులైజర్ ఉపయోస్తుంటారు .  ఈ నెబ్యులైజర్ మనచుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నున్న ఆక్సిజన్ ను సేకరించి మనకందిస్తుంది . ప్రస్తుతానికి ఆక్సిజన్ దొరకక ఇబ్బందిపడేవారు , ఈ నెబ్యులైజర్ ను ఉపయోగించుకొని ప్రాణాలను కాపాడుకోవచ్చును . నెబ్యులైజర్ 2 వేలు మొదలు 3 వేలవరకు ఉంటుంది. ఈ నెబ్యులైజర్ ను మనము ఇంట్లోనే ఉపయోగించుకొనవచ్చును . ఇందులో ఎలాంటి క్యాప్సూలు వాడవలసిన అవసరం లేదు .    

 


 



Monday, 19 April 2021

లాక్ డౌన్ సమయం కేటాయింపు

     మళ్ళ్ళీ కరోనా కేసులు పెరగడంతో ఏం చెయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాము . కరోనా కంట్రోల్ చెయడానికి ఒకవేళ లాక్ డౌన్ విధిస్తే , ఉదయం 4 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటలవరకూ వ్యాపార సంస్థలు  తెరుచుకోడానికి సమయాన్ని కేటాఇస్తే  బాగుంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు . తీవ్రమైన ఎండ ఒకప్రక్క , కరోనా ఒక ప్రక్క , ప్రజల వద్ద డబ్బులు లేకపోవడం  ఇలా అనేక కారణాలవల్ల మద్యాహ్నం 2 గంటల నుండి  ప్రజలు బయట తిరగడం లేదు . వ్యాపారులు ఉదయం నుండి రాత్రి వరకూ కాచుకు కూర్చున్నా , మధ్యాహ్నం పైన వ్యాపారాలు జరగడం లేదని , ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వ్యాపారాలు నడుపుకోడానికి సమయం ఇస్తే చాలని , వ్యాపార సంస్థల యజమానులు అభిప్రాయపడుతున్నారు .  

అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు

అనారోగ్యం కలిగినప్పుడు డబ్బులు చెల్లించి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చని ధనిక మధ్య తరగతి వారు హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రాధాన్యత ...