అనారోగ్యం కలిగినప్పుడు డబ్బులు చెల్లించి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చని ధనిక మధ్య తరగతి వారు హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రాధాన్యత ఇస్తారు , ముఖ్యంగా సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు కూడా తమ కుటుంబానికి మంచి వైద్యం కోసం, ఇన్సురెన్సు కోసం వేల రూపాయలు వెచ్చిస్తున్నారు . మరి హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన వారికి లేదా వారి కుటుంబానికి కరోనా సోకి ప్రైవేటు ఆసుపత్రిలో చేరడానికి వెళితే ఇన్సూరెన్స్ ఉన్నవారికి బెడ్స్ లేవు అని ఖచ్చితంగా చెబుతున్నారు , అదే ఆసుపత్రిలో నగదు చెల్లిస్తే బెడ్ ఉంది అంటున్నారు . కరోనా లాంటి మహమ్మారి రోగానికి గురై ఆసుపత్రికి వెళితే హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లదు , నగదు చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకుంటాం అన్నప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనం ఏముంది . ఆలోచించండి . ఎందుకో మరి ఇన్సూరెన్స్ కంపనీలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్టిస్తున్నారు . ఇలాగే ఉలుకూ పలుకూ లేకుండా ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇబ్బందిలో పడే సూచనలు కనిపిస్తున్నాయి . ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం మెరుగ్గా ఉంది . కరోనా సోకిన వారికి కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షలు ఖర్చు పెట్టినా చివరకు చేతులెత్తేసి మా వల్ల కాదు అని చెప్పి , కొంతమంది పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని సిఫార్సు చేస్తున్నారు . ప్రైవేట్ ఆసుపత్రిలో హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లనప్పుడు , వేల రూపాయలు చెల్లించి ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది . పెద్దగా అనారోగ్యం కలిగినప్పుడు లక్షల రూపాయలు చెల్లించుకొలేకనే కదా ఇన్సూరెన్స్ చేసేది . పేదవాడికి చిన్న చిన్న అనారోగ్యాలు కలిగినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో , ఆర్ యం పి డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకోవచ్చు కదా . హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేముందు ఓ సారి ఆలోచిస్తే బాగుంటుందని హెల్త్ ఇన్సూరెన్స్ చేసి కూడా కార్పొరేట్ వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారు తెలియచేస్తున్నారు .
Sunday 23 May 2021
Saturday 22 May 2021
కరోనాకు కషాయం
Thursday 6 May 2021
హైదరాబాద్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి ఉచిత ఆహార పంపిణి
యూసఫ్ గూడ , శ్రీనగర్ కాలనీ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్ల్ ఏరియాలో కరోన వచ్చి హోం క్వారెంటైనలో హోం క్వారంటైన్ లో ఉన్నవారికి ఉచితంగా ఆహారం పంణీ చెస్తున్న నీహారిక రెడ్డి కి మరియు ఆమెకుసహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ జొమటొ న్యూస్ తరఫున క్రుతగ్నతలు తెలియచేస్తున్నాము . ఇలా మనసున్నవారు , ఇబ్బందులలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన అవసర మొచ్చింది . తోచిన సహాయం చేసి మన తోటివారిని కాపాడుకుందాం . జీరా రైస్ , ఆలు కూర్మ , కీరా , క్యారెట్ , ఇమ్మ్యూనిటీ చాక్లెట్ , పెరుగు లాంటి ఆహారము అందిచబడును . హైదరాబాదులోని యూసఫ్ గూడ , శ్రీనగర్ కాలనీ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్ల్ ఏరియాలో కరోన వచ్చి హోం క్వారెంటైనలో ఉంటూ.. ఫుడ్ కి ఇబ్బంది పడుతున్న వారెవరైనా ఈ క్రింద నెంబర్ కి కాల్ చేయండి. ఒక రోజు ముందుగా కాల్ చేసి , మీ లొకేషన్ షేర్ చేస్తే మేము మీకు టైం కి హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ మీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తాము . మరిన్ని వివరములకు సంప్రదించండి 9701821089
Wednesday 5 May 2021
ఉద్యోగం చేస్తున్న మహిళలకు రవాణా ఇబ్బందులు
Sunday 2 May 2021
ఇమ్యూనిటీ పెరగాలంటే
ప్రతి ఒక్కరూ ఇదే ఆలో చిస్తూ ఉంటారు . కొంతమంది కూరగాయలు తినండి , ఆకు కూరలు తినండి , డ్రై ఫ్రూట్స్ తినండి , చికెన్ , మటన్ తినండి , కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తినండి ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటుంటారు . ఓ వారం రోజులు ఇవి తిన్నంత మాత్రాన ఇమ్యూనిటీ పెరగదు , మన నిత్య జీవితంలో అలవాటుగా చేసుకొని తింటూఉండాలి .
ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుంటే అసలు మన పూర్వీకులు ఇవన్నీ తినేవారా? సంగటి తో పాటు పచ్చి మిరపకాయ యర్రగడ్డ నంజుకొని తినేవారు . వారు వ్యవసాయం చేసే వారు , కాయా కష్టం చేసేవారు , బరువులు ఎత్తే వారు , కిలో మీటర్లకొద్దీ నదిచే వారు , గంపెడు పిల్లల్ని కనేవారు , ఉమ్మడి కుటుంబం లో కలిసి అంతమందికి వంటలు చేసి వారికి సేవలుచేసేవారు . కారణం ఏం తిన్నారన్నది కాదు ముఖ్యం . తిన్నది ఏదైనా సరే తిన్నదానికి సరిపడా శారీరిక వ్యాయామం చేశామా లేదా అనేది ముఖ్యం . సంగటి తినండి లేదా జీడిపప్పు బాదం పప్పు తినండి మీ క్యాలరీలు బర్న్ అయి మీ శరీరంలో శక్తి రూపంలో నిలువ ఉండడమనేది ముఖ్యం . తిన్నది జీర్ణం అయినప్పుడే మన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది . ఈ లాజిక్ కొంచెం ఆలోచిస్తే మనకంటే మన పూర్వీకులే ఆరోగ్యంగా ఉండేవారు . ఏం తినాలి అనే ఆలోచన పక్కన పెట్టి , తిన్నది ఎలా జీర్ణం చేయాలి అనేదాని గురించి ఆలోచించండి . ఏ పూట తిన్నది ఆపూట జీర్ణం అయ్యేలా శారీరక కష్టం చేయగలినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం . మన ఇమ్యూనిటీ కూడా పెంచుకోగలం .
కరోనా . . . నన్నేం చేయలేదు . . .
అవును కరోనా వైరస్ మిమ్మల్నేం చేయలేక పోవచ్చు , కానీ మీ వల్ల మీ ఇంటిలోని వారిని అమ్మా నాన్నా , భార్యా పిల్లలు , అవ్వ తాత వీళ్లకు మీ వల్ల కరోనా వైరస్ సోకవచ్చు . మీలాగా ఇమ్యూనిటీ వారికి ఉండకపోవచ్చు , వారికి వైరస్ సోకి మరణించిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు . ఆలోచించండి . జరగరానిది జరగకముందే జాగ్రత్త పడండి .
Thursday 29 April 2021
మీ ఇంట్లోనే గొంతు ఊపిరి తిత్తుల్లోని కఫాన్ని తగ్గించుకోండి
త్రిదోషాలలో ఒకటైన కఫ దోషం కలగడంవల్ల , కొంతమంది వేరే ప్రదేశం మారినా , నీళ్ళు మారినా జలుబు చేసినట్లు ఉండడం , గొంతులో మరియు ఛాతీలో అనగా ఊపిరితిత్తుల్లో గల్ల పేరుకు పోయి , విపరీతమైన దగ్గు రావడం, ఊపిరి ఆడడంలో ఇబ్బంది కలుగుతుంది . ఇలాంటి సందర్భాల్లో మన వంట ఇంట్లోనే లభించే మజ్జిగ మరియు వాము తో ఈ కఫాన్ని దగ్గును తగ్గించుకోవచ్చును . ముందుగా వామును పొడి చేసుకొని , అర చెంచా వాము పొడిని గ్లాసు పలుచటి మజ్జిగలొ కలుపుకొని పరగడపునగానీ సాయంత్రం 6 గంటల సమయంలో గాని రోజుకొకసారి త్రాగినా కఫం నుండి ఉపశమనం పొందవచ్చును . ఒకవేళ మజ్జిగ పడనీ వారు , మజ్జిగ అందుబాటులో లేనప్పుడు గ్లాసు మంచి నీళ్లలో అరస్పూను వామును లేదా వాము పొడిని కలిపి పొయ్యి మీద కాచి వడగట్టి గోరువెచ్చగా అయినా తర్వాత తాగిన ఎడల కఫాన్ని తగ్గించుకోవచ్చును . ప్రస్తుత కరోనా పరిస్థితిలో , గొంతులో , ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి , శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పెడుతున్న కఫాన్ని తగ్గించుకోడానికి కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది . ఈ చిట్కాను ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రదీప్ వానపల్లి తెలియచేశారు , వారికి జొమాటో న్యూస్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నాము .
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 2023 క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా , శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక సమేత పుణ్యక్షేత్రము లో,, 6-1- 2023 తేదీన అనేకమంది న...

-
మీ పిల్లలకు పెళ్ళి చేస్తున్నారా ? అయితే కొంతవరకు ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు . అబ్బాయి గానీ అమ్మాయి గానీ పెళ్ళి చూపుల సమయంలో నేను ...
-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , తిరుపతి రెవెన్యూ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమైనవని రెడ్ క్రాస్ చైర్మన్ డి వెంకటేశ్వర...
-
నెల్లూరుజిల్లా క్రిష్ణపట్నం లో కరోనాను అరికట్టడానికి ఆయుర్వేద వైద్యం ఇస్తున్న ఆనందయ్య వద్ద వేల మంది జనం క్యూ ఉన్నందున ఆయుర్వేద మందు దొర...